![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -428 లో.... నోటిసులు నేనే పంపించాను.. దానికి వాళ్లకు ఏం సంబంధం లేదు.. ఇలాంటి మంచిపనులు నేనే చేస్తాను.. ఈ క్రెడిట్ నాకే అని శ్రీధర్ గొప్పలు చెప్పుకుంటాడు.. ఇక ఆస్తులు వాటాలు చెయ్యండి అని ఆస్తుల గురించి శ్రీధర్ చెప్తుంటాడు. ఇక శివన్నారాయణకి కోపం వచ్చి నువ్వు ముందులేరా మర్యాదగా.. ఇక్కడ నుండి వెళ్ళిపో ఆస్తులలో వాటా కావాలంటే నా కూతురు అడగాలి నువ్వేంట్రా అని శివన్నారాయణ కోప్పడతాడు.
ఇంకొకసారి ఇలా నోటిసులు అంటూ ఇబ్బంది పెట్టకండి.. మాకు ఆస్తులు అవసరం లేదు.. బంధాలు కావాలని నోటీసులని చింపి శ్రీధర్ చేతిలో పెడుతాడు కార్తీక్. ఇక మీరు మారరని చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు. మీరు చాలా మాటలు అన్నారు అయ్యగారు.. మీ కూతురికి మీకంటే ఎక్కువ పౌరుషమని శివన్నారాయణతో దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు ఇంటికి వచ్చి శ్రీధర్ చేసిన పని గురించి చెప్తారు. నా వాళ్ళని బాధపెడుతున్నాడని కాంచన ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు శ్రీధర్ కోపంగా ఉంటాడు. ఎందుకండి అన్నీ ఇలాంటి పనులు చేస్తారు.. దీపని కోడలుగా ఒప్పుకోండి అని కావేరి అంటుంది. అసలు ఎప్పటికి జరగదని శ్రీధర్ అంటాడు. ఆ దీపతో నా కొడుకుకి విడాకులు ఇప్పిస్తాను.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని శ్రీధర్ అనుకుంటాడు.
ఆస్తులు అడిగితే నా కూతురు అడగాలన్నాడు. ఒకవేళ కాంచన అడిగితే ఆస్తులు ఇస్తాడని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఇవ్వన్నీ అత్త ఆస్తులు అయితే బావని పెళ్లి చేసుకుంటే నాకే కదా అని జ్యోత్స్న అంటుంది. అంటే నీకు ఇంకా కార్తీక్ పై ఆశ పోలేదా అని పారిజాతం అంటుంది. లేదు ఎప్పటికిపోదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న జాతకాన్ని పంతులు గారికి చూపిస్తారు. అది చూసి ఈ జాతకం ప్రకారం అయితే ఆల్రెడి ఈ అమ్మాయికి పెళ్లి అయి ఉండాలని పంతులు అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అది తన జాతకం అయితేనే కదా అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |